HomeUncategorizedనియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే కృషి ఆశించ దగ్గదే, అధికారుల నిర్లిప్తత అలసత్వం వల్ల ప్రజల్లో అసంతృప్తి

నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే కృషి ఆశించ దగ్గదే, అధికారుల నిర్లిప్తత అలసత్వం వల్ల ప్రజల్లో అసంతృప్తి

📰 Generate e-Paper Clip

.కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కోర్వార్ నగేష్ 

తెలంగాణ డెక్కన్ న్యూస్, తాండూర్: వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మంచి జననేత, స్వామ్యుడు, ఆయన మంచితనం చూసి నియోజకవర్గంలోని కొందరు అధికారులు ప్రజల పట్ల అలసత్వం, నిర్లక్ష్యం వహిస్తున్నారని దీనివల్ల ప్రభుత్వానికి, పార్టీకి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉందని, అంతేకాకుండా ప్రజల్లో ఆత్మవిశ్వాసం కూడా సన్న గిల్లే ప్రమాదం ఉందని, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కోర్వార్ నగేష్ అభిప్రాయపడ్డారు. 1962 లో తాండూర్ నియోజకవర్గం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు 14 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయని, ఇందులో అతి ఎక్కువ కాలం రాజకీయాలు శాసించిన నేతలు ఉన్నారని కానీ తాండూర్ నియోజకవర్గంలో అనుకున్న స్థాయిలో అభివృద్ధి పనులు చేయించలేకపోయారని, ముఖ్యంగా కాలుష్య నియంత్రణను కట్టడి చేయడంలో విఫలమయ్యారని, కావున ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని, తాండూర్ లోని మేధావులు, అన్ని పార్టీల నాయకులతో కలిసి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి, కాలుష్య నియంత్రణ కోసం ఒక కమిటీని ఏర్పాటు చేయాలనీ, కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక చొరవ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన పేర్కొన్నారు. తాండూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎన్నో నిధులను తీసుకొచ్చి అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నారని, కానీ అధికారుల అలసత్వం వల్ల అభివృద్ధి పనులు నత్తనడకన కొనసాగుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా నియోజకవర్గంలోని పార్టీలోని సీనియర్ నాయకులకు, కాంగ్రెస్ పార్టీ జెండా మోసి, అహర్నియలు కష్టపడిన కార్యకర్తలను గుర్తించడం లేదని, ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు ప్రాధాన్యతనిస్తున్నారని, తద్వారా నాయకుల పట్ల ప్రజల్లో అసంతృప్తి జ్వాలలు, ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుందని ఆరోపణలు వినిపిస్తున్నాయని, పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం ఇందిరమ్మ ఇండ్లు, గ్యాస్ సబ్సిడీ, వృద్ధులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు పెన్షన్లు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, రైతులకు రుణమాఫీ, రేషన్ కార్డులు, మహిళలకు ఉచిత బస్సు, డ్వాక్రా రుణాలు, ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పటికీ, వాటిని ప్రజల్లోకి పూర్తిస్థాయిలో తీసుకెళ్లేందుకు నాయకుల విఫలమవుతున్నారని, వీటి పైన ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గత ప్రభుత్వాలు కూడా ప్రజలకు ఎన్నో హమీలు ఇచ్చి వాటిని అమలకు నోచుకోకపోవడం వలన నియోజకవర్గంలోని ప్రజలు స్థానికంగా  ప్రజలకు అందుబాటులో ఉండి, ప్రజలకు సేవ చేసే నాయకుడికి పట్టం కట్టేందుకు అవకాశాలు స్పష్టంగా ఉంటాయని, ఆ దిశగా పార్టీ నాయకులు ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. తాండూర్ పట్టణం అభివృద్ధి చెందాలంటే, ముఖ్యంగా ట్రాఫిక్ సమస్యను నియంత్రించాలని, నాపరాతి మెషిన్లను జీనుగుర్తి సమీపంలో వారికి కేటాయించిన స్థలంలోకి మార్చాలని, గంజి లో ఉన్న మార్కెట్ యార్డ్ ను ఖాన్జపుర్ కు మార్చాలని, గొల్ల చెరువు సమీపంలో మినీ ట్యాంక్ బండ్ అసంపూర్తిగా ఉందని,  ఇంటిగ్రేటెడ్ మార్కెట్, లారీ పార్కింగ్, తదితర సమస్యలపై ప్రజల్లో వ్యతిరేక పవనాలు స్పష్టంగా వినిపిస్తున్నాయని, వీటి పైన దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. నేటి వరకు పరిపాలన చేసిన నాయకుల కంటే తాండూర్ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అధిక నిధులు తీసుకొస్తున్నారని, నిరుద్యోగ యువత కోసం ఏటీసీ సెంటర్, కోటపల్లి ప్రాజెక్ట్ మరమ్మత్తుల కోసం ఎన్నో నిధులు తీసుకొచ్చారని తద్వారా రైతుల పంట పొలాలకు ఎంతో మేలు చేకూరుతుందని, ఎమ్మెల్యే కృషికి అధికారులు ప్రత్యేక చొరవ చూపిస్తే, తాండూర్ పట్టణం త్వరితగతిన అభివృద్ధి చెందుతుందని, ముఖ్యంగా ప్రజలకు అనుగుణంగా నాయకులు మారినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యపడుతుందని, పార్టీ సీనియర్ నాయకులు కోర్వార్ నగేష్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular