HomeUncategorizedపలువురి వివాహ శుభకార్యాలకు హాజరైన శుభప్రద్ పటేల్

పలువురి వివాహ శుభకార్యాలకు హాజరైన శుభప్రద్ పటేల్

📰 Generate e-Paper Clip

.  నూతన వధూవరులను ఆశీర్వదించిన బీసీ కమిషన్ మాజీ సభ్యులు, బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు

 తెలంగాణ డెక్కన్ న్యూస్, తాండూర్: రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యులు, బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు శుభప్రద్ పటేల్ బషీరాబాద్ మండల పరిధిలోని నీళ్లపల్లి, నావల్గ తదితర గ్రామాలతో పాటు తాండూర్ పట్టణంలో నిర్వహించిన పలువురు అభిమానులు, పార్టీ శ్రేణులు, సన్నిహితుల వివాహ శుభకార్యాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని ఆకాంక్షించారు. అలాగే వివాహ వేడుకల్లో పాల్గొన్న కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అభిమానులు, సన్నిహితుల కుటుంబాల్లో జరిగిన శుభకార్యాల్లో పాల్గొంటూ వారితో తనకున్న అనుబంధాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, అభిమానులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

కె. అనంతయ్య తెలంగాణ డెక్కన్ న్యూస్: తాండూర్. 9550230699

RELATED ARTICLES

Most Popular