HomeUncategorizedఅకాల మరణం పట్ల పంజుగుల విట్టల్ రెడ్డి సంతాపం

అకాల మరణం పట్ల పంజుగుల విట్టల్ రెడ్డి సంతాపం

📰 Generate e-Paper Clip

తెలంగాణ డెక్కన్ న్యూస్, తాండూర్: వికారాబాద్ జిల్లా తాండూర్ మండలం గౌతపూర్ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ సీనియర్ నాయకురాలు శకుంతల వారి అల్లుడు అకాల మరణం చెందడంతో ఆయన కుటుంబాన్ని బి ఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తండ్రి పంజాగుల విఠల్ రెడ్డి స్థానిక తాండూర్ నాయకులతో కలసి వారి స్వగ్రామమైన కొడంగల్ నియోజకవర్గం లోని మెట్ల కుంట గ్రామానికి వెళ్లి పరామర్శించారు. వారి నివాసంలో మృతుడి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యాలాల్ మండలం బి ఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, తాండూర్ పట్టణ సీనియర్ నాయకులు సాయిపూర్ నరసింహులు, శ్రీనివాస్ చారి, వెంకట్ రెడ్డి, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కె. అనంతయ్య తెలంగాణ డెక్కన్ న్యూస్ 9550230699

RELATED ARTICLES

Most Popular