
.కన్నుల పండుగగా ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయం లో ఆధ్యాత్మిక వేడుకలు
.కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవ లో పైలెట్ రోహిత్ రెడ్డి
తెలంగాణ డెక్కన్ న్యూస్, తాండూర్: అయ్యప్ప స్వామి నామస్మరణతో తాండూర్ పట్టణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ప్రతి సంవత్సరం భక్తిశ్రద్ధలతో నిర్వహించే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈ ఏడాది కూడా బి ఆర్ ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు.
తాండూర్ పట్టణంలోని ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయంలో నిర్వహించిన ఈ మహా పడిపూజ వేడుకలు భక్తులకు కన్నుల పండుగగా నిలిచాయి. ఆలయ పరిసర ప్రాంతాలు అయ్యప్ప నామస్మరణతో మారుమోగంగా, భక్తి గీతాలు, ప్రత్యేక పూజలు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ఆలయ ప్రాంగణం భక్త పరవశంలో మునిగిపోయింది. సాంప్రదాయ పూజా విధానాల మధ్య సాగిన ఈ కార్యక్రమంలో రోహిత్ రెడ్డి స్వయంగా పాల్గొని స్వామి వారికి స్వయంగా పూజలు నిర్వహించారు. కన్య స్వాములు, కత్తి స్వాములు, గదా స్వాములు, గురుస్వాముల సమక్షంలో జరిగిన ఈ వేడుకల్లో అయ్యప్ప స్వాములను ఆ భేంగ పలకరించిన పైలట్ రోహిత్ రెడ్డి దంపతులు.
ఈ పవిత్ర కార్యక్రమానికి తాండూర్ నియోజకవర్గం నలుమూలల నుంచి అయ్యప్ప స్వాములు, బి ఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు, మండల అధ్యక్షులు, వివిధ గ్రామాల సర్పంచులు, తాండూర్ పట్టణ కౌన్సిలర్లు, రోహిత్ రెడ్డి అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
కె. అనంతయ్య తెలంగాణ డెక్కన్ న్యూస్: 9550230699
