HomeUncategorizedపల్లెల్లో దాగి ఉన్న క్రీడాకారుల ప్రతిభను వెలికి తీస్తాం.. ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్సీ పట్నం...

పల్లెల్లో దాగి ఉన్న క్రీడాకారుల ప్రతిభను వెలికి తీస్తాం.. ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి

📰 Generate e-Paper Clip

తెలంగాణ డెక్కన్ న్యూస్, తాండూర్ : గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారులను  గుర్తించి, వారిలో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలకి తీసి, వారికి తగిన ప్రోత్సహాన్ని కల్పించి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు సహకరిస్తామని శాసనమండలి ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. తాండూర్ నియోజకవర్గం యాలాల్ మండల పరిధిలోని తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన మైలారం సంతోష్ కుమార్ ఇటీవల హైదరాబాద్ స్కూల్ గేమ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్ 19 పరుగు పందెంలో ఐదు కిలోమీటర్ల విభాగంలో బంగారు పతకం, మూడు కిలోమీటర్ల విభాగంలో కాంష్య పథకం సాధించారు. ఈ సందర్భంగా సంతోష్ కుమార్ మహేందర్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి సంతోష్ కుమార్కు శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ఎంతోోో మంది విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యం దాగి ఉందని, వారిని ప్రోత్సహించేందుకు తమ విద్యాసంస్థల ద్వారా కావలసిన సహకారం అందిస్తానని, ముఖ్యంగా తాండూర్ ప్రాంత క్రీడాకారులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని, సంతోష్ కుమార్ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సంతోష్ కుమార్ తండ్రి రామప్ప, గ్రామస్తులు అంజయ్య, నవీన్, రాము, తుల్జరామ్, నర్సింలు, మల్లేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.

కె. అనంతయ్య తెలంగాణ డెక్కన్ న్యూస్, తాండూర్ 9550230699

RELATED ARTICLES

Most Popular