HomeUncategorizedతాండూర్ పట్టణానికి రూ.1.40 కోట్లతో నూతన సబ్ రిజిస్టర్ కార్యాలయం

తాండూర్ పట్టణానికి రూ.1.40 కోట్లతో నూతన సబ్ రిజిస్టర్ కార్యాలయం

📰 Generate e-Paper Clip

.ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మెరుగైన రిజిస్ట్రేషన్ సేవలు..

తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి 

తెలంగాణ డెక్కన్ న్యూస్, తాండూర్: రిజిస్ట్రేషన్ సేవల కోసం వచ్చే ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ రోడ్డు మార్గంలో గల రాజీవ్ కాలనీలో రూ.1.40 కోట్ల వ్యయంతో నూతన సబ్ రిజిస్టర్ కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా తాండూర్ పట్టణంలో సబ్ రిజిస్టర్ కార్యాలయానికి సొంత భవనం లేకపోవడం వల్ల అధికారులు, డాక్యుమెంట్ రైటర్లు, ప్రజలు, ముఖ్యంగా మహిళలు ఎన్నో ఇబ్బందులకు గురయ్యారని, వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని తాండూరు పట్టణానికి అన్ని వసతులు ఉండే విధంగా నూతన సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్రెడ్డి, తాండూర్ పట్టణ మున్సిపల్ కౌన్సిలర్లు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు, పార్టీ సీనియర్ నాయకులు, మున్సిపల్ కమిషనర్ రాకేష్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు బాతుల నాగరాజ్, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ ఎనిమిదో వార్డ్ ఇంచార్జ్ సాయప్ప, పార్టీ సీనియర్ నాయకులు, డాక్యుమెంట్ రైటర్లు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular