
. తాండూర్ పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం ఆధ్వర్యంలో శ్రీకాంత్ కు ఘనంగా సన్మానం
తెలంగాణ డెక్కన్ న్యూస్, తాండూర్: బిజెపి పార్టీ బలోపేతం కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు కూడా సముచిత స్థానం ఇవ్వడం జరుగుతుందని తాండూర్ మున్సిపల్ కౌన్సిలర్, పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం పేర్కొన్నారు. జిల్లా ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శిగా నియమితులైన శ్రీకాంత్ కు తాండూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. శ్రీకాంత్ ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శిగా నియామకం ప్రతి ఒక్క యువ నాయకులకు స్ఫూర్తిదాయకమని, మున్ముందు జిల్లాలోని ఎస్సీ మోర్చా ను మరింత అభివృద్ధి చేసేందుకు శ్రీకాంత్ కృషి చేయాలని పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం ఆకాంక్షించారు. ఇట్టి కార్యక్రమంలో పట్టణ ఉపాధ్యక్షులు దోమ కృష్ణ, పార్టీ నాయకులు ప్రకాష్, ప్రహ్లాద్, జాదవ్, పట్టణ కమిటీ సభ్యులు చందు, బిచ్చప్ప, బబ్లు, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. 
