భక్త పరవశంలో తాండూర్.. అంగరంగ వైభవంగా అయ్యప్ప స్వామి మహా పడిపూజ
.కన్నుల పండుగగా ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయం లో ఆధ్యాత్మిక వేడుకలు .కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవ లో పైలెట్ రోహిత్ రెడ్డి తెలంగాణ డెక్కన్ న్యూస్, తాండూర్: అయ్యప్ప స్వామి నామస్మరణతో తాండూర్ పట్టణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ప్రతి సంవత్సరం భక్తిశ్రద్ధలతో నిర్వహించే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈ ఏడాది కూడా బి ఆర్ ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. తాండూర్ పట్టణంలోని...