పల్లెల్లో దాగి ఉన్న క్రీడాకారుల ప్రతిభను వెలికి తీస్తాం.. ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి
తెలంగాణ డెక్కన్ న్యూస్, తాండూర్ : గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారులను గుర్తించి, వారిలో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలకి తీసి, వారికి తగిన ప్రోత్సహాన్ని కల్పించి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు సహకరిస్తామని శాసనమండలి ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. తాండూర్ నియోజకవర్గం యాలాల్ మండల పరిధిలోని తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన మైలారం సంతోష్ కుమార్ ఇటీవల హైదరాబాద్ స్కూల్ గేమ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్ 19 పరుగు పందెంలో ఐదు కిలోమీటర్ల విభాగంలో బంగారు...