HomeUncategorizedశరన్నవరాత్రి ఉత్సవాల్లో 9 రూపాయల్లో భక్తులకు అమ్మవారీ దర్శనం

శరన్నవరాత్రి ఉత్సవాల్లో 9 రూపాయల్లో భక్తులకు అమ్మవారీ దర్శనం

📰 Generate e-Paper Clip

తెలంగాణ డెక్కన్. తాండూర్: హిందూ సంప్రదాయంలో దుర్గాదేవిని ఆదిపరాశక్తిగా జగన్మాతగా కొలుస్తారు. సృష్టికి మూలమైన ఆదిశక్తి మహిషాసురుడు అనే రాక్షసుడి భారీ నుంచి లోకాలను కాపాడటానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తేజస్సు నుండి శక్తి రూపంలో ఉద్భవించింది. నవరాత్రుల్లో అమ్మవారిని తొమ్మిది రూపాయల్లో పూజిస్తారు. ఈ తొమ్మిది రూపాయలను నవదుర్గాలు అని పిలుస్తారు. అమ్మవారి ప్రతిరూపం ఒక ప్రత్యేకమైన శక్తిని గుణాన్ని తెలియజేస్తుంది.

1. శైలపుత్రి దేవి : శైలపుత్రి అంటే పర్వత రాజైన హిమావంతుని కుమార్తె అని అర్థం. ఈమె పార్వతి దేవి మొదటి రూపంగా ప్రసిద్ధి చెందింది. ఈ రూపం ప్రకృతి శక్తికి ధైర్యానికి ప్రతీకగా పేర్కొంటారు.2. బ్రహ్మచారిని దేవి : పరమ శివుడిని భర్తగా పొందడానికి పార్వతి దేవి ఎంతో కఠినమైన తపస్సు చేసింది. ఆ తపస్సు నియమం భక్తికి ప్రతీకగా బ్రహ్మచారిని రూపం ప్రసిద్ధి చెందింది. ఈ రూపాన్ని పూజించడం ద్వారా సహనం ఏకాగ్రత పట్టుదల వంటి సద్గుణాలను అలవర్చుకుంటారని భక్తుల నమ్మకం.3. చంద్రఘంటాదేవి : అమ్మవారి నుదిటిపై ఘంటాకారంలో అర్థ చంద్రుడు ఉండడంతో ఈమెకు చంద్ర గంట అనే పేరు వచ్చింది. దుష్టశక్తులను ఎదుర్కొనే ధైర్యం సాహసం ఈ రూపం ద్వారా తెలుస్తాయి.4: కుష్మాండ దేవి : పురాతన సంప్రదాయం ప్రకారం తన దివ్యమైన చిరునవ్వుతో విశ్వానికి వెలుగును ప్రసాదించిన ఆదిశక్తి కుష్నాండ దేవి. ఈ రూపం జీవశక్తి ఆరోగ్యం వెలుగు సానుకూలతను సూచిస్తుంది.5. స్కంద మాత దేవి : సుబ్రహ్మణ్య స్వామి లేదా స్కందూడికి తల్లిగా ఉన్నందున ఈమెను స్కందమాత అని పిలుస్తారు. ఈ రూపం మాతృ ప్రేమ కరుణ కుటుంబం బంధాలకు ప్రతీక గా నిలుస్తుంది.6. కాత్యాయని దేవి : మహిషా సురుడు అనే రాక్షసుడిని సంవరించిన శక్తివంతమైన దేవి స్వరూపంతో ఈమె ప్రసిద్ధి చెందింది. కాత్యాయని దేవి ధర్మరక్షణకు దుష్ట శిక్షణకు ప్రతీక గా పేర్కొంటారు.7. కాలరాత్రి దేవి : ఈమె దుష్టశక్తులను నాశనం చేసి ధర్మాన్ని కాపాడుతుందని పురాణాలు చెబుతాయి. ఈ రూపం చీకటిపై వెలుగు భయంపై ధైర్యం చెడుపై మంచి సాధించే విజయానికి ప్రతికగా నిలుస్తుంది.8. మహా గౌరీ దేవి : కఠినమైన తపస్సు అనంతరం పార్వతి దేవి దివ్యమైన తెల్లని కాంతితో ప్రకాశించిందని పురాణాల్లో పేర్కొంటారు. మహా గౌరీ పవిత్రత శాంతి క్షేమ మంగళానికి ప్రతీక. భక్తులు తమ జీవితాల్లో ప్రశాంతత సుఖసంతోషాలు కలగాలని ఈమెను ప్రార్థిస్తారు.9. సిద్ధి ధాత్రి దేవి : సిద్ధి ధాత్రి అంటే సిద్దులను దివ్యమైన శక్తులను ప్రసాదించేది అని అర్థం. ఈమెను దేవతలు ఋషులు భక్తులు ఆరాధిస్తారని పురాణాల్లో పేర్కొంటారు. ఈ రూపం జ్ఞానం ఆధ్యాత్మికత పురోగతి సంపూర్ణతకు ప్రతీక గా పేర్కొంటారు. ఈ విధంగా శరన్నవరాత్రి ఉత్సవాల్లో 9 రోజుల్లో అమ్మవారు భక్తులకు 9 రూపాయల్లో దర్శనమిస్తుందని భక్తుల నమ్మకం.

RELATED ARTICLES

Most Popular