HomeUncategorizedపైలెట్ రోహిత్ రెడ్డి ఇంట్లో రుద్రాభిషేకం

పైలెట్ రోహిత్ రెడ్డి ఇంట్లో రుద్రాభిషేకం

📰 Generate e-Paper Clip

తెలంగాణ డెక్కన్ న్యూస్, తాండూర్: కార్తీక మాసాన్ని పురస్కరించుకొని, మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నివాసంలో ఆయన మాతృమూర్తి వికారాబాద్ మాజీ జెడ్పిటిసి పంజుగు ల ప్రమోదీని రెడ్డి , ఆయన సతీమణి ఆర్తి రెడ్డి శుక్రవారం రోజున పరమశివుడికి భక్తిశ్రద్ధలతో ఘనంగా రుద్రాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి తాండూర్ నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ప్రార్థించారు. కార్యక్రమంలో తాండూర్ మండల బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు వీరేందర్ రెడ్డి, యాలాల్ మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కె. అనంతయ్య తెలంగాణ డెక్కన్ న్యూస్, తాండూర్. 9550230699

RELATED ARTICLES

Most Popular