పైలెట్ రోహిత్ రెడ్డి ఇంట్లో రుద్రాభిషేకం
తెలంగాణ డెక్కన్ న్యూస్, తాండూర్: కార్తీక మాసాన్ని పురస్కరించుకొని, మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నివాసంలో ఆయన మాతృమూర్తి వికారాబాద్ మాజీ జెడ్పిటిసి పంజుగు ల ప్రమోదీని రెడ్డి , ఆయన సతీమణి ఆర్తి రెడ్డి శుక్రవారం రోజున పరమశివుడికి భక్తిశ్రద్ధలతో ఘనంగా రుద్రాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి తాండూర్ నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ప్రార్థించారు. కార్యక్రమంలో తాండూర్ మండల బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు వీరేందర్ రెడ్డి, యాలాల్...