HomeUncategorizedఅయ్యప్ప స్వాముల సేవలో పంజుగుల కుటుంబం.. ఘనంగా మహా ప్రసాద వితరణ

అయ్యప్ప స్వాముల సేవలో పంజుగుల కుటుంబం.. ఘనంగా మహా ప్రసాద వితరణ

📰 Generate e-Paper Clip

. బావిగి భద్రేశ్వర ఆలయంలో అయ్యప్ప స్వామి సిద్ధి కార్యక్రమం 

. భక్తులకు స్వయంగా మహా ప్రసాదం అందించిన పంజుగుల విట్టల్ రెడ్డి కుటుంబ సభ్యులు

  •   తెలంగాణ డెక్కన్ న్యూస్, తాండూర్: తాండూర్ పట్టణంలో శ్రీ బావిగి భద్రేశ్వర దేవాలయంలో 36వ వార్డ్ బి ఆర్ఎస్ కౌన్సిలర్ రూప రుద్రపటేల్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ అయ్యప్ప స్వామి సిద్ధి ( మహా ప్రసాదం) కార్యక్రమానికి పంజుగుల కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని, పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అయ్యప్ప స్వాముల సేవలో పాల్గొనడం, వారికి సేవ చేసుకునే అవకాశం దొరకడం ఎంతో సంతోషంగా ఉందని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సతీమణి పంజుగుల ఆర్తి రెడ్డి అన్నారు. అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. అయ్యప్ప స్వాముల భక్తి, క్రమశిక్షణ, సేవా భావం అందరికీ ఆదర్శమని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో రోహిత్ల్ రెడ్డి, కుటుంబ సభ్యులు పంజుగుల  విట్టల్ రెడ్డి, పంజుగుల ప్రమోదిని, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజు గౌడ్, సీనియర్ నాయకులు సాయిపూర్ నరసింహులు, శ్రీనివాస్ చారి, వెంకట్ రెడ్డి, తాండూర్ పట్టణ బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నర కుల నరేందర్ గౌడ్, నాయకులు దత్తాత్రేయ, సందీప్ కొర్రా, వినోద్, అశ్వక్, సోయల్, అబ్రార్ లాల, మహమూద్ తదితరులు పాల్గొన్నారు. స్వాములకు మహా ప్రసాద వితరణ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సతీమణి ఆర్తి రెడ్డి 
  •  తెలంగాణ డెక్కన్ న్యూస్, తాండూర్  9550230699

RELATED ARTICLES

Most Popular