TELANGANA DECCAN
Newspaper Banner
Date of Publish : 26 November 2026, 12:50 pm Posted by : TELANGANA DECCAN

వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన వడ్డే రాములు కు సన్మానం

. బీసీ సంఘం ఆధ్వర్యంలో అభినందనలు..

తెలంగాణ డెక్కన్ న్యూస్, తాండూర్ : వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన వడ్డే రాములు, జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బీసీ సంఘం ఆధ్వర్యంలో వడ్డే రాములు ఘనంగా సన్మానించి, అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా బీసీ సంఘం నాయకులు రాజ్ కుమార్ మాట్లాడుతూ.. వడ్డెర సంఘం అభివృద్ధికి, బీసీ వర్గాల ఐక్యతకు వడ్డే రాములు తన వంతు కృషి చేయాలని ఆకాంక్షించారు. సంఘటితంగా ముందుకు సాగుతూ వడ్డెర సామాజిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. తనకు జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన సంఘం నాయకులకు వడ్డే రాములు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ మాజీ అధ్యక్షులు, ప్రభాకర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి కావలి సంతోష్, బీసీ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

కె. అనంతయ్య, తెలంగాణ డెక్కన్ న్యూస్, తాండూర్ 9550230699