రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చెక్క దిద్దుతూ.. సంక్షేమం, అభివృద్ధి కి సమ ప్రాధాన్యతనిస్తున్న ప్రజా ప్రభుత్వం

తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి  తెలంగాణ డెక్కన్ న్యూస్, తాండూర్: గత పాలకుల వలె మాటలకే పరిమితం కాకుండా, ఇచ్చిన హామీలన్నీ దశలవారీగా అమలు చేస్తూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేస్తూ ప్రజా ప్రభుత్వ పాలన ఈ విధంగా ఉంటుందని నిరూపించుకుంటున్నామని, తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని  మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం ఎంపీడీవో కార్యాలయావరణలో మండలానికి చెందిన దాదాపు 908 మంది లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు పత్రాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే...