
. జూనియర్ కళాశాల మైదానం నుంచి తాండూర్ పురవీధుల గుండా క్రమశిక్షణతో సాగిన పత్ సంచలన్
తెలంగాణ డెక్కన్ న్యూస్, తాండూర్: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తాండూర్ పట్టణంలో ఆర్ ఎస్ ఎస్ పత్ సంచలన్ జూనియర్ కళాశాల మైదానంలో ప్రారంభమై ఇందిరా చౌక్, శివాజీ చౌక్, మర్రిచెట్టు కూడలి, బద్వేశ్వర చౌక్, మీదుగా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, హిందూ సంఘాల నేతలు పూర్తి క్రమశిక్షణతో ఏకరూప దుస్తులు ధరించి క్రమబద్ధంగా అడుగులు వేస్తూ పత్ సంచలనం లో పాల్గొన్నారు. పత్ సంచలన్ జరుగుతున్న సమయంలో పలుచోట్ల హిందూ సంఘాల నేతలు, హిందూ వాహిని, ఆర్యవైశ్య సంఘం నేతలు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు పూలతో స్వాగతం పలికారు. కార్యక్రమం ప్రారంభం నుంచి ముగిసే వరకు తాండూర్ పోలీసులు ట్రాఫిక్ నియంత్రణ చేస్తూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాండూర్ పట్టణ వివిధ శాఖలకు చెందిన హిందూ సంఘాల నేతలు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.