మాత మతకల్ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి
తెలంగాణ డెక్కన్ న్యూస్, తాండూర్ : కర్ణాటక రాష్ట్రం, సేడం తాలూకాలోని మధు కంటి గ్రామంలో వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన ఆదిశక్తి స్వరూపిణిగా కొలువైన మాత మతకల్ గ్రామదేవతను తెలంగాణ శాసనమండలి ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి భక్తీశ్రద్ధలతో దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, న్యాయవాది కరణం పురుషోత్తం రావు, బిర్కట్ రఘు, రాజశేఖర్ తదితరులు ఉన్నారు. వీరితో పాటు గ్రామ పెద్దలు మాధవరెడ్డి, వెంకట్ రెడ్డి, నర్సిరెడ్డి,...