TELANGANA DECCAN
Newspaper Banner
Date of Publish : 24 November 2026, 4:54 pm Posted by : TELANGANA DECCAN

మాత మతకల్ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి

తెలంగాణ డెక్కన్ న్యూస్, తాండూర్ : కర్ణాటక రాష్ట్రం, సేడం తాలూకాలోని మధు కంటి గ్రామంలో వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన ఆదిశక్తి స్వరూపిణిగా కొలువైన మాత మతకల్ గ్రామదేవతను తెలంగాణ శాసనమండలి ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి భక్తీశ్రద్ధలతో దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, న్యాయవాది కరణం పురుషోత్తం రావు, బిర్కట్ రఘు, రాజశేఖర్ తదితరులు ఉన్నారు. వీరితో పాటు గ్రామ పెద్దలు మాధవరెడ్డి, వెంకట్ రెడ్డి, నర్సిరెడ్డి, శానా గౌడ, జనార్దన్ రెడ్డి, కృష్ణారెడ్డి, సాయిలు యాదవ్, దానప్ప, సిద్దు పూజారి, ఆలయ పూజారి శానప్ప తదితరులు పాల్గొన్నారు.

K. Ananthaiah. Telangana Deccan news. 9550230699