
. సాయిపూర్ లో ఘనంగా వరలక్ష్మి వ్రతం..
. మహిళ ముత్తెదువులకు వాయినాలు అందించిన పంజుగుల ప్రమోదిని రెడ్డి, ఆర్తి రెడ్డి
తెలంగాణ డెక్కన్ న్యూస్, తాండూర్: మన సాంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను, భావితరాలకు అందించడంలో మహిళల పాత్ర ఎంతో గొప్పదని, మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సతీమణి పంజుగుల ఆర్తి రెడ్డి పేర్కొన్నారు. తాండూర్ పట్టణంలోని సాయిపూర్లో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పట్లోళ్ల దీప నర్సింలు నివాసంలో వైభవంగా నిర్వహించిన వరలక్ష్మీ వ్రతం కార్యక్రమానికి బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు, రోహిత్ రెడ్డి తండ్రి పంజుగుల విట్టల్ రెడ్డి, మాతృమూర్తి ప్రమోదిని రెడ్డి, సతీమణి ఆర్తి రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వరలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పంజుగుల కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరైన మహిళ ముత్తేదువులకు వాహనాలు అందజేశారు. ఈ సందర్భంగా పంచుగుల ఆర్తి రెడ్డి మాట్లాడుతూ.. వరలక్ష్మీ వ్రతం మహిళలకు ఎంతో పవిత్రమైన పండుగని, కుటుంబ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం కోసం అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారని అన్నారు.
ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు మహిళల మధ్య ఆత్మీయతను పెంపొందించడంతోపాటు మన సంస్కృతిని, సాంప్రదాయాలను కాపాడేందుకు దోదపడతాయని తెలిపారు. తాండూర్ నియోజకవర్గం లోని ప్రతి ఒక్క కుటుంబం పై వరలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బి ఆర్ ఎస్ మున్సిపల్ కౌన్సిలర్లు, మండల అధ్యక్షులు, సీనియర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కే అనంతయ్య, తెలంగాణ డెక్కన్ న్యూస్ తాండూర్. 9550230699