TELANGANA DECCAN
Newspaper Banner
Date of Publish : 18 November 2026, 10:59 am Posted by : TELANGANA DECCAN

పోలీసుల తీరుపై భగ్గుమన్న బి ఆర్ఎస్ శ్రేణులు

. మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడ్ 

తెలంగాణ డెక్కన్ న్యూస్, తాండూర్: ప్రజా సమస్యలను ప్రశ్నిస్తే, అడ్డంకులు సృష్టించడం, నిరసన తెలిపితే కేసుల పేరుతో భయపెట్టడం ప్రజాస్వామ్య పాలనకు విరుద్ధంగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన కొనసాగుతుందని, బి ఆర్ ఎస్ నాయకులు మండిపడ్డారు. మున్సిపల్ పరిధిలోని 8 వ వార్డ్ కౌన్సిలర్ తాను ప్రాతినిథ్యం వహిస్తున్న రాజీవ్ కాలనీలో నూతన సబ్ రిజిస్టర్ కార్యాలయానికి శంకుస్థాపన చేపట్టే ఎమ్మెల్యే అధికారిక కార్యక్రమానికి తనను రానివ్వకుండా ముందస్తుగా అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసం అని వారు పోలీసులను హెచ్చరించారు. ప్రజల రక్షణ కోసం విధులను నిర్వర్తించాల్సిన పోలీసు వ్యవస్థ పూర్తిగా అధికార పక్షానికి కొమ్ము కాస్తుందని వారు పేర్కొన్నారు. ప్రజా పాలనలో తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి పాలన ఏ విధంగా కొనసాగుతుందో ప్రజలు అర్థం చేసుకోవాలని వారు పేర్కొన్నారు. రాబోయే ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమని, అప్పుడు మా నాయకులను ఇబ్బంది పెట్టిన వారిని ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని బి ఆర్ ఎస్ నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడ్, కౌన్సిలర్ జావిద్, వర్కింగ్ ప్రెసిడెంట్ నరుకుల నరేందర్ గౌడ్, పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ చారి, వెంకట్ రెడ్డి, దత్తాత్రేయ, ఇంతియాజ్, ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు.