
తెలంగాణ డెక్కన్ న్యూస్, తాండూర్: తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ హెచ్ 143 వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు రవికుమార్, ప్రధాన కార్యదర్శి ప్రహ్లాద్ చారి, రాష్ట్ర కమిటీ కార్యవర్గ సభ్యులు, ఆసిఫ్ హుస్సేన్ ఆధ్వర్యంలో తాండూర్ టియుడబ్ల్యుజే 143 డివిజన్ ఎన్నికలు తాండూర్ పట్టణంలో నిర్వహించారు. ఇట్టి ఎన్నికలకు వికారాబాద్ నియోజకవర్గంలోని కొడంగల్, పరిగి, వికారాబాద్ పట్టణంలోని జర్నలిస్టులందరూ హాజరయ్యారు. ప్రింట్, మరియు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల ఎన్నికలు నిర్వహించారు. మొదటగా తాండూర్ మండల ప్రింట్ మీడియా అధ్యక్షుడిగా యాలాల్ మండలానికి చెందిన ఉదయం ప్రతినిధి మొగులయ్య తాండూర్ మండల అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కె. అనంతయ్య తెలంగాణ డెక్కన్ ప్రతినిధి, ప్రధాన కార్యదర్శి గా ఎన్నికయ్యారు. పర్యాద రవి కిరణ్ తాండూర్ నియోజకవర్గం ప్రజా వాయిస్ ప్రతినిధి కోశాధికారిగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులుగా రూప్ సింగ్ సివిఆర్ న్యూస్, వీరేంద్ర ప్రసాద్ ఎన్ 9 న్యూస్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నికలకు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆసీఫ్ హుస్సేన్ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు రవికుమార్, ప్రధాన కార్యదర్శి ప్రహ్లాద్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆసిఫ్ హుస్సేన్ తదితరులు మాట్లాడుతూ.. జర్నలిస్టుల హక్కుల కోసం, వారి సమస్యల కోసం డివిజన్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పోరాటం చేయాలని, అందరూ కలిసికట్టుగా పోరాటం చేయాలని, రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ సార్ ఆధ్వర్యంలో అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఇండ్ల స్థలాలు, అక్రిడేషన్ కార్డులు, ఇండ్ల స్థలాలు ఇచ్చేవరకు మన మందరం కలిసి పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. ఉద్యమాలు చేసి స్వరాష్ట్రం సాధించుకున్న యూనియన్ లో మనందరం ఉన్నందుకు ఎంతో గర్వించదగ్గ విషయమని, మన సంఖ్య బలం తాండూర్ లో తక్కువగా ఉందనే ఎవరు అధైర్యపడవద్దని, మనకు బలమైన నాయకత్వం, జిల్లా స్థాయిలో రాష్ట్రస్థాయిలో, ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటుందని వారు భరోసా ఇచ్చారు. తాండూర్ ప్రాంతం నుంచి జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి లో ఏర్పాటైన కమిటీలలో వాళ్ళు కొన్ని ఉపాధ్యక్షులుగా గజాల శివశంకర్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడుగా జిల్లా సంస్కృతి విభాగం కల్పించారు కార్యక్రమం విజయవంతం చేయడంలో బాధ్యతలను అప్పగించారు. వికారాబాద్ జిల్లా ఉపాధ్యక్షులుగా గజ్జల శివశంకర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా, జిల్లా సంస్కృతిక విభాగం ఇన్చార్జిగా కూర యాదయ్య, రాజు లకు చోటు కల్పించారు. కార్యక్రమం విజయవంతం చేయడంలో తోడ్పాటు అందించిన జిల్లా కార్యవర్గనికి తాండూరు నియోజకవర్గ జర్నలిస్టుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో జిల్లా యూనియన్ సభ్యులు, పరిగి, తాండూర్, వికారాబాద్, పట్టణాలకు చెందిన జర్నలిస్టులు పాల్గొన్నారు.