
. చిన్నారుల ఎదుగుదలకు ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయం
. 7 వ వార్డ్ బి ఆర్ ఎస్ కౌన్సిలర్ ఈర్షద్
తెలంగాణ డెక్కన్ న్యూస్, తాండూర్: చిన్నారుల్లో పోషక ఆహార లోపాన్ని నివారించి, ఆరోగ్యవంతమైన ఎదుగుదలకు బాటలు వేయాలనే లక్ష్యంతో తాండూర్ పట్టణంలోని ఏడవ వార్డ్ అంగన్వాడి కేంద్రంలో చిన్నారులకు అల్పాహారం అందించే కార్యక్రమాన్ని బి.ఆర్.ఎస్ కౌన్సిలర్ ఇర్షద్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు ప్రతిరోజు ఉదయం అల్పాహారంగా కిచిడి, ఉప్మా రవ్వ వంటి పోషక విలువలు కలిగిన ఆరపదార్థాలను ప్రభుత్వం అందివ్వడం ఎంతో శుభ పరిణామామని ఆయన కొనియాడారు. చిన్నారులకు పౌష్టికాహారం అందించడం ద్వారా వారిలో ఆరోగ్యవంతమైన ఎదుగుదలతో పాటు, శారీరక మానసిక వికాసం మెరుగుపడుతుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. చిన్నారుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, అంగన్వాడి కేంద్రాల సేవలను మరింత సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. చిన్నారులకు పౌష్టికాహారం అందించే ఈ కార్యక్రమం వారి బంగారు భవిష్యత్తుకు ఎంతగానో దూదపడుతుందని కౌన్సిలర్ ఇర్షాద్ పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిదారులకు వచ్చే సమాచారాన్ని, ప్రజలకు ఉపయోగపడే ప్రతి సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రతి విషయాన్ని ప్రజలకు వివరిస్తున్న కౌన్సిలర్ పనితీరుపై కాలనీవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.