TELANGANA DECCAN
Newspaper Banner
Date of Publish : 18 November 2026, 3:14 pm Posted by : TELANGANA DECCAN

ఇందిరా గాంధీ జయంతి వేడుకలకు కాంగ్రెస్ శ్రేణులకు ఆహ్వానం

తెలంగాణ డెక్కన్ న్యూస్, తాండూర్: మాజీ ప్రధాని, భారతరత్న ఇందిరా గాంధీ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం ఉదయం 10 గంటలకు పోలీస్ స్టేషన్ సమీపంలోని ఇందిరా చౌక్ వద్ద ఘనంగా నిర్వహించనున్నట్లు  పట్టణ అధ్యక్షులు బాతుల నాగరాజ్ తెలిపారు . ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, పార్టీ కౌన్సిలర్లు, వార్డు ఇన్చార్జీలు, వార్డ్ కమిటీ  అధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, పార్టీ కార్యకర్తలు తదితరులు హాజరై ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.